ఆవిష్కరణలతోనే భవిష్యత్తు

– ఇజ్రాయెల్‌, భారత్‌ల భాగస్వామ్యం అద్భుతాలు సృష్టిస్తుంది

– ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు

ముంబయి, జనవరి18(జ‌నంసాక్షి) : కొత్త ఆవిష్కరణలతోనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, భవిష్యత్‌ ఆవిష్కర్తలదేనని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అన్నారు. గురువారం ముంబయిలోని తాజ్‌ ¬టల్‌లో ఆయన వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆవిష్కర్తలదే భవిష్యత్తు అంటూ ఆయన ప్రసంగం ప్రారంభించారు. ఇక్కడ ఇజ్రాయెల్‌, భారత వ్యాపారవేత్తలు కలవడం చాలా కీలకమైన విషయమని అన్నారు. ఇజ్రాయెల్‌లో మేము, భారత్‌లో విూరు మంచి భవిష్యత్తుకు కారకులవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఆవిష్కరణలు వాటంతటే రావని, కొత్త ఆలోచనల నుంచి వస్తాయని..వాటిని ప్రోత్సహించాలని నెతన్యాహు పేర్కొన్నారు. అలాంటి ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వాలు కల్పించాలని అన్నారు. ఇజ్రాయెల్‌, భారత్‌ల భాగస్వామ్యం అద్భుతాలు సృష్టిస్తుందన్నారు. వ్యాపార రంగాల్లో ఇరు దేశాలు సత్సంబంధాలతో ముందుకు సాగాలని ఆకాంక్షింస్తున్నట్లు తెలిపారు. ఈ

సమావేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు రాహుల్‌ బజాజ్‌, ఆది గోద్రేజ్‌, హర్ష గోయెంకా, ఆనంద్‌ మహీంద్రా, దిలీప్‌ సంఘ్వి, అశోక్‌ హిందూజా, అతుల్‌ పుంజ్‌, చందా కొచ్చర్‌ తదితరులు పాల్గొన్నారు.