ఆశ్రమ పాఠశాల ఆకులవారి ఘన్ పూర్ PGHM సస్పెండ్ ఎత్తి వేయాలి.

-ASU డిమాండ్…

ములుగు/ఏటూరునాగారం, సెప్టెంబర్ 4(జనంసాక్షి):-

ఏటూరునాగారం
మండల కేంద్రంలో తుడుందెబ్బ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆదివాసీ విద్యార్థి సంఘం ASU ములుగు జిల్లా అద్యక్షులు దబ్బకట్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల ఆకులవారి ఘన్ పూర్ PGHM రేవతి ని సస్పెండ్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉండి వారి విద్యాభివృద్ధి కొరకు పాటు పడుతున్న HM ని మరల విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం. ITDA పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో AUPS లో GP పాఠశాలల్లో* చాలా సంవత్సరాల నుండి సమస్యలు పరిష్కరించబడకుండా ఉన్నవి పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కనీస సౌకర్యాలు అరకొరగా అందిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం అయి
నాలుగు నెలలు గడిచినప్పటికి వారికి కావలసిన సౌకర్యాలను కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారు.
స్పోర్ట్స్ పాఠశాల, పాలిటెక్నిక్ కళాశాల, TTC, B.ED కళాశాలలు ప్రారంభించబడలేదు.ఆశ్రమ పాఠశాలల్లోని, కళాశాలల్లోని సమస్యలు పేరకపోయి ఉన్నవి. గ్రామీణ స్థాయిలో ఉండే GP పాఠశాల భవనాలు శిథిలావస్థ స్థితిలో ఉన్నవి. బ్లాక్ బోర్డు, ఖుర్చీలు, బెంచీలు, కరెంట్ సదుపాయం కల్పించడం లేదు. విద్యార్థులకు గురుకులాలలో, స్పోర్ట్స్ పాఠశాలల్లో, కళాశాలల్లో సీట్లు కేటాయించడంలో పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా కార్పోరేట్ కళాశాలల్లో
ఆదివాసీ విద్యార్థులకు అందాల్సిన సీట్లు లంబాడీ విద్యార్థులకు కేటాయిస్తున్నారు. ఆదివాసీ విద్యా అభివృధ్ధిని నిర్లక్ష్యం చేస్తున్న విద్యాశాక అధికారులు, ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఆదివాసీ విద్యా అభివృద్ధి కోసం ఏజెన్సీలో ఉన్న పాఠశాలల్లో, కళాశాలల్లో సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తున్నాం.
సమస్యల సాధన కొరకై దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ఆదివాసీ విద్యార్థుల సంఘం ములుగు జిల్లా అద్యక్షులు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బొదెబోయిన సురెందర్, వట్టం సురెందర్ రావు తో పాటు విద్యార్ధి నాయకులు పాల్గోన్నారు.

 

ఆదివాసీ విద్యార్ధి సంఘం ములుగు జిల్లా అద్యక్షులు
దబ్బకట్ల శ్రీకాంత్.