ఆసరా పెన్షన్స్ కావు ఆత్మగౌరవ కార్డులుఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.శనివారం నేరేడుచర్ల మున్సిపాలిటి లోని టౌన్ హాల్ లో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్లు కార్డులు పంపిణీ అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,చిన్న చిన్న అవసరాలకు సైతం ఎంతో ఇబ్బంది పడుతున్న,వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు వితంతులకు నేత గీత కార్మికులకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పెన్షన్ అందించి ఆత్మగౌరవంతో జీవించేలా చేశారన్నారు.2014 ఎలక్షన్ లో పెన్షన్ వెయ్యి రూపాయలు ఇస్తాను అని కేసీఆర్ చెబితే ఆనాడు ఎవరు నమ్మలే కానీ కేసీఆర్ నేడు 2000 ఇస్తున్నారు.
ఉద్యోగస్తులైన 62 సంవత్సరాలకి రిటైర్ అవ్వాల్సిందే కానీ కెసిఆర్ 57 ఏళ్ళకి పెన్షన్ అనే ఉద్యోగం ఇస్తున్నారు.కేసిఆర్ ప్రాణం ఉన్నంత వరకు ఇస్తూనే ఉంటారు. అందుకని పెన్షన్ దారులు కెసిఆర్ కి ఉద్యోగులలా పని చేయాలి అని కోరారు.మరో మూడు నెలల్లో నేరేడుచర్ల రూపు రేఖలు మారిపోతాయని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చందమల్ల జయబాబు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇంజమూరి యశోద రాములు,
డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, కౌన్సిలర్లు తాళ్లూరి సాయిరాం,షేక్ బాషా,అలక సరిత, బానోత్ లలిత, షానవాజ్
వేమూరి నాగవేణి, కొదమగుండ్ల సరిత, గ్రంధాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు,మేనేజర్ అశోక్ రెడ్డి,తెరాస నాయకులు వల్లంసెట్ల రమేష్ బాబు,చిత్తలురి సైదులు, ఆకారపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.