ఆసిఫ్‌నగర్‌లో యువతి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్, జనంసాక్షి: అసిఫ్ ఏసిపి కార్యాలయం ముందు యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక హెడ్ కానిస్టేబుల్ కుమారుడితో ఉన్న ప్రేమ వ్యవహారం విషయంలో ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో ఆమె ఈ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. వెంటనే తేరుకున్న పోలీసులు యువతిని చికిత్స కోసం హడావుడిగా ఆస్పత్రికి తరలించారు.