ఆసియా కప్ హాకీటోర్నీలో పాక్ పై భారత్ అపూర్వ విజయం
ఆసియా కప్ హాకీ టోర్నీలో పాక్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో 3-1 తేడాతో ఘన విక్టరీ సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే పాకిస్థాన్ డిఫెన్స్‌ని ఛేదిస్తూ ఆ జట్టుని ఒత్తిడిలోకి నెట్టిన భారత్ 17వ నిమిషంలోనే గోల్ సాధించింది. అనంతరం 44వ నిమిషంలో రమణదీప్ సింగ్, 45వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ వరుసగా గోల్ చేసి ఆధిక్యాన్ని 3-0కి చేర్చడంతో భారత్ విజయం దాదాపు ఖాయమైంది. అయితే.. 49వ నిమిషంలో అలీ షాన్ ఒక గోల్ కొట్టి ఆధిక్యాన్ని 3-1కి తగ్గించినా.. చివరి వరకూ జాగ్రత్తగా ఆడిన భారత్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకు ముందు జరిగిన మ్యాచ్ లలో జపాన్‌ని 5-1 తేడాతో, బంగ్లాదేశ్‌ని 7-0తో ఓడించింది హకీ ఇండియా.