ఆసీస్ లక్ష్యం 131

హోబర్ట్: ప్రపంచ కప్ గ్రూపు-ఎలో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో స్కాట్లాండ్ 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో  టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన స్కాట్లాండ్ 25.4 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. స్కాట్లాండ్ జట్టులో మాచన్ (40) టాప్ స్కోరర్. డెవీ 26, మెక్లియోడ్ 22, లియస్క్ 23 (నాఔట్) పరుగులు చేయగా, మిగిలిన బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లు స్టార్క్ 4, కమిన్స్ 3 వికెట్లు తీశారు.