ఆసుపత్రిలో పలు విభాగాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి
ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రీయ ఔషధి నిలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అక్షయ, శిశుచికిత్స కేంద్రం, ఆరోగ్యశ్రీ విభాగం, ఐసీయూ కేంద్రాలను కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి ప్రభుత్వంనుంచి అందుతున్న సహాయ పథకాల గురించి వారి స్పందన తెలుసుకున్నారు.