ఆసుపత్రులపై దాడుల నివారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
హైదరాబాద్ 2 జూలై (జనంసాక్షి):సోమాజిగూడలోని కత్రియ ¬టల్‌లో తెలంగాణ ప్రైవేటు హాస్పిటల్స్, నర్సింగ్ ¬మ్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆస్పత్రులపై దాడుల నివారణకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రుల పర్మిషన్ల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ప్రకటించారు. ఆరోగ్య తెలంగాణ కోసం బడ్జెట్‌తో కూడిన ప్రణాళికలు తయారు చేస్తామని వెల్లడించారు. నాయిని మాట్లాడుతూ.. ఆస్పత్రుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. ఆస్పత్రులపై దాడులను ప్రజలు ప్రతిచర్యగా భావించరాదు అని చెప్పారు.