ఆస్టేల్రియా ఓపెన్‌లో సెరినాకు షాక్..
– కరోలిన్ ప్లిస్కోవా చేతిలో చిత్తు!
మెల్‌బోర్న్, జనవరి23(జనంసాక్షి) : మహిళ టెన్నీస్ దిగ్గజం, ఆమెరికాకు చెందిన సెరినా విలియమ్స్ కు ఆస్టేల్రియా ఓపెన్ ను మరోసారి గెలవాలన్న కలలు కల్లలయ్యాయి.. ఈ టోర్నీలో ప్రీ క్వార్టర్స్ లో టాప్ సీడ్ హెలెప్ పై ఘనవిజయం సాధించిన సెరినాకు క్వార్టర్ పైనల్స్ లో చుక్కెదురైంది.. క్వార్టర్ పైనల్స్ సెరినా ఎనిమిదో సీడ్ కరోలిన్ ప్లిస్కోవ్ చేతిలో 4-6,6-4. 5-7 స్కోర్ తో చిత్తయింది.. రెండు మ్యాచ్ లలో చెరోకటి గెలుచుకున్న ఈ ఇద్దరూ నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్ లో ¬రా ¬రిగా తలపడ్డారు.. ట్రై బ్రేకర్ వరకూ సాగిన ఈ మ్యాచ్ లో ఒకనోక దశలో కరోలిన్ 1-5 తో వెనుకబడింది.. ఈ దశలో కరోలిన్ అద్భుతమైన ఆట తీరుతో మ్యాచ్ పాయింట్ ను కాపాడుకుంటూ స్కోర్ ను 5-5 తో సమం చేసింది.. ఇక టై బ్రేకర్ లోనూ ఈ ఇద్దరు ఒక్కో పాయింట్ కోసం చెమటొడ్చారు..సెరీనా పవర్ గేమ్ ను ధీటుగా ఎదుర్కొని చివరి మ్యాచ్ ను 7-5తో గెలుచుకుని గేమ్ ను స్వంత చేసుకుని సెవిూస్ లోకి దూసుకెళ్లింది. ఈ ఓటమితో 24వ గ్రాండ్ సామ్ నెగ్గాలని భావించిన సెరెనా ఆశలు గల్లంతయ్యాయి. దీంతో సెరినా- పిస్కోవా ముఖాముఖి 2-2గా నమోదైంది. 2016 యూఎస్ ఓపెన్ సెవిూస్‌లో కూడా ప్లిస్కోవా చేతిలో సెరెనా ఖంగుతింది.