ఆస్ట్రియాలో ఉగ్రదాడి

ఇద్దరిని కాల్చిచంపిన ముష్కరులు..

పలువురికి గాయాలు

వియన్నా,నవంబరు3 (జనంసాక్షి):ఆస్ట్రియాలోని సెంట్రల్‌ వియన్నాలో కాల్పులు కలకలం సృష్టించాయి. సోమవారం సాయంత్రం మారణాయుధాలు ధరించిన ముష్కరులు ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా అనేకమంది గాయపడ్డారు. కాగా ఓ అనుమానితుడిని పోలీసులు మట్టుబెట్టారు. ‘మారణాయుధాలు ధరించిన దుండగులు ఆరు ప్రాంతాల్లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఓ అనుమానితుడిని కాల్చి చంపాం’ అని వియాన్నా పోలీసులు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. మేయర్‌ మైఖేల్‌ లుడ్విగ్‌ దుర్ఘటనపై స్పందిస్తూ దాడిలో గాయపడ్డ మరో మహిళ మృతిచెందినట్లు వెల్లడించారు. ఆస్ట్రియన్‌ ఛాన్సెలర్‌ సెబాస్టియన్‌ కుర్జ్‌ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను ఉగ్రదాడిగా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాడతామని, వారికి తగిన బుద్ధి చెబుతామని వెల్లడించారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆర్మీని రంగంలోకి దించనున్నట్లు తెలిపారు.వియన్నాలో ఉగ్రదాడిపై భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌గ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘వియన్నాలో ఉగ్రదాడిగ్భ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద సమయంలో ఆస్ట్రియాకు భారత్‌ తోడుగా నిలవనుంది’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ‘యూరోప్‌లో జరిగిన ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి నా సంతాపం. అమాయకులపై దాడులు హేయమైన చర్య. ఉగ్రవాదానికి వ్యకతిరేకంగా ఆస్ట్రియా, ఫ్రాన్స్‌తోపాటు యూరోప్‌లోని అన్ని దేశాలకు అమెరికా మద్దతుగా నిలవనుంది’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.