ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 270
బర్మింగ్ హామ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫ్రీలో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ల లో ఇయాన్ బెల్ (91), ట్రాట్(43), బొపారా(46), కుక్(30) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలలో మెక్‌కే, ఫాల్కనర్‌లు తలో రెండు వికెట్లు తీశారు. స్టార్క్, వాట్సన్‌లు చెరో వికెట్ తీశారు.