ఆస్ట్రేలియా స్థానిక ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ గెలిచిన తెలంగాణ ఆడబిడ్డ!
తెలంగాణ బిడ్డకు దక్కిన గౌరవం , అభినందించిన మహేష్ బిగాల!
సెప్టెంబర్ 5న జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ కరెన్ పెన్సబెన్ మేయర్‌గా ఎన్నికయ్యారని, కౌన్సిలర్ తెలంగాణ బిడ్డ సంధ్య రెడ్డి (శాండీ రెడ్డి) డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారని స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ ప్రకటించారు . స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ ఎన్నికలు. పాతిక వేల ఓటర్లు. హోరాహోరీ పోరాటం. రాజకీయ పార్టీల ప్రాబల్యం. ఉత్కంఠ భరితమైన ఆ స్థానిక పోరులో తెలంగాణ ఆడబిడ్డ శాండీ రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు ,ఆమె స్థానిక నివాసితులకు ప్రాతినిధ్యం వహిస్తుందని మరియు వారికి అండగా నిలబడుతా అని అన్నారు, సంధ్య రెడ్డి (శాండీ రెడ్డి) కి 2020 సంవత్సరానికి స్ట్రాత్‌ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది, ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా నియమితులైన మొదటి భారతీయ సంతతి అది మన తెలంగాణ బిడ్డ కావడం విశేషం.ఈ సందర్బంగా మహేష్ బిగాల సంధ్య రెడ్డి (శాండీ రెడ్డి) ని అభినందిచారు, అలాగే ఖండాంతరాలు దాటినా పీవీ ఖ్యాతి, ఆస్ట్రేలియాలో ఘనంగా మొట్ట మొదటి విగ్రహ ఆవిష్కారణ జరిగిన విషయాన్నీ గుర్తు చేస్తూ మేయర్ , కౌన్సిల్ సభ్యురాలు సంధ్య రెడ్డి (శాండీ రెడ్డి) మరియు ఇతర కౌన్సిల్ సభ్యులు మరియు మొత్తం భారతీయ ప్రవాసుల మద్దతుతో, మేము హోమ్‌బుష్ కమ్యూనిటీ సెంటర్‌లో పివి నర్సింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించామని అన్నారు , రాబోయే రోజుల్లో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశించారు