ఆస్తి తగాదాల నేపథ్యంలో ఇద్దరి చిన్నారుల హత్య
రంగారెడ్డి: శంకర్‌పల్లి మండలం పుండకల్ గ్రామంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో ఓ మహిళతోపాటు ఆమె ఇద్దరు పిల్లలకు బంధువులు విషంపెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు నందిని (3), జ్యోత్స్నీ (8నెలలు)లు మృతి చెందగా తల్లి ఉషారాణిని ఆసుపత్రికి తరలించారు. ఉషారాణికి బంధువులకు మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి తగాదాలు నెలకొనడంతోనే ఈ దారుణం చోటుచేసుకొందని స్థానికులు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.