ఆస్పత్రి ఎదుట రోగి బంధువుల ఆందోళన
కోరుట్ల జూన్ 12 (జనంసాక్షి) వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళకునిర్వహించిన ఆపరేషన్ వికటించడంతోరోగి బంధువులు మంగళవారం రోజున ఆసత్రి ఎదుట ఆందోళనకు దిగారువివరాల్లోకి వెళితే, కథలాపూర్ మండలంలోని దూలుర్ గ్రామానికి చెందిన ములుగు లక్ష్మి అనే మహిళ గత ఏడాదిన్నర క్రితం ప్రసవ నిమిత్తం కోరుట్ల పట్టణంలోని సురేఖ నర్సింగ్ హోంలోచేరింది. వైద్యురాలులక్ష్మికి సిజేరియన్ ఆపరేషన్ చేసిన సమయంలో చేతులు తుడుచుకునే గుడ్డను కడుపులోమరిచిపోయి ఆపరేషన్ ముగించారు. అప్పటి నుండి లక్ష్మి తీవ్ర అనారోగ్యానికి గురైంది. లక్ష్మిని చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆమె కడుపులో గుడ్డ ఉందని గుర్తించి, ఆపరేషన్ చేసి గుడ్డను తొలగించారు, కాగా రోగి బంధువులు నిర్లక్ష్యనికి కారణమైన ఆస్పత్రి సామాగ్రి ధ్వంసం చేయడానికియత్నించగా పోలీసులు సకాలంలో చేరుకుని ఆందోళన కారులను శాంతింపజేశారు.