ఆస్ర్టేలియాపై న్యూజిలాండ్ విజయం
ఆక్లాండ్ వేదికగా ఆస్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఆసే్ట్రలియా విసిరిన 152 పరుగుల విజయ లక్ష్యాన్ని 23.1 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట్లో ధాటిగా ప్రారంభమైన న్యూజిలాండ్ ఇన్నింగ్ తర్వాత త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో నెమ్మదించింది. ఒక దశలో విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడింది. మొదట్లో బలంగా కనిపించిన న్యూజిలాండ్ తర్వాత 106 పరుగులకే 9వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో నరాలు తెగే ఉత్కంఠ చోటుచేసుకుంది. చివరికి విలియమ్స్(45) సంయమనంతో ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు.