ఆహారం పరబ్రహ్మ స్వరూపం వృధా చేయొద్దు
-రతన్ సింగ్ ఠాకూర్ ,కోడిమాల శ్రీనివాసరావు.
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 16(జనం సాక్షి)
ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఏ వీ వి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కోడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆహార భద్రతపై వాలంటీర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ ఠాగూర్ రతన్ సింగ్ వాలంటీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం అనగా ప్రోటీన్స్, మినరల్స్ , కార్బోహైడ్రేట్స్ మొదలగు పోషక విలువ ఉన్న ఆహారాన్ని అందించాలని అప్పుడే ప్రజల జీవన ప్రమాణము, ఆరోగ్యము సురక్షితంగా ఉంటుందని అన్నారు .నేటి యువత ముఖ్యంగా జంక్ ఫుడ్ కు అలవాటు పడి తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని కావున సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్ లకు దూరం ఉండి మంచి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్య వంతులుగా ఉండాలని అన్నారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎక్కువమంది ప్రజలు ఇన్స్టంట్ ఫుడ్ చిరుతిండ్లు కు అలవాటు పడి శారీరిక శ్రమలేఖ, కల్తీ ఆహారాన్ని భుజిస్తూ ప్రిజర్వేటివ్ ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటూ ఆరోగ్య విషయంలో అజాగ్రత్తతో ఉంటున్నారని ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరమని అన్నారు, అలాగే ఫుడ్ వేస్టేజ్ కూడా ఎక్కువ చేస్తున్నారని ఫంక్షన్ లో ఎక్కువ ఐటమ్స్ పెట్టాలని ఆలోచనతో ఆహారం వృధా అవుతుందని ఆహారం పరబ్రహ్మ స్వరూపం దీన్ని వృధా చేయటాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ముఖ్యంగా వాలంటీర్లు నాణ్యమైన ఆహారము మరియు ఫుడ్ వేస్టేజ్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ యాక్టివిస్టులు విజయ రావు , రిటైర్డ్ టీచర్ సర్వేశం ,వాలంటీర్లు సంతోష్, కార్తికేయ, ప్రమోద్, దీపక్, సంతోషి, సదాఫ్ ఉమేరా ,అరుణ్, సాకేత్, తదితరులు పాల్గొన్నారు.