ఆ ఉరి చరిత్రలో చీకటి రోజు

SC_director_B
యెమన్‌ ఉరికి నిరసనగా సుప్రీం డిప్యూటి రిజిస్ట్రార్‌ రాజీనామా

ఢిల్లీ ఆగస్టు 2 (జనంసాక్షి) :

ముంబై వరుస పేలుళ్ళ కేసులో దోషిగా తేలిన యాకుబ్‌ మెమన్‌ పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటీషన్‌పై విచారించి కొన్ని గంటల వ్యవధిలో ఉరిశిక్షను ఖరారు చేయడాన్ని సుప్రీంకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్‌, నేషనల్‌ లా యూనివర్శిటీ ఫ్యాకల్టీ సభ్యుడైన ప్రొఫెసర్‌ సురేంద్రనాథ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. మెమన్‌ మరణశిక్షను ఖరారు చేయడాన్ని భారత న్యాయ చరిత్రలో చీకటి గంటలుగా ఆయన అభివర్ణించారు. దీనికి నిరసనగా డిప్యూటీ రిజిస్ట్రార్‌ పదవికి రాజీనామా చేయగా, దాన్ని కొన్ని గంటల్లోనే ఆమోదించి.. రిలీవింగ్‌ లెటర్‌ను కూడా ఇచ్చినట్టు కోర్టు వర్గాల సమాచారం. 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఒక తీర్పిచ్చి, దాన్ని పరిశీలించాలని కోరితే, 12 గంటల వ్యవధిలో పరిశీలన పూర్తి చేసి అదే తీర్పును ఖరారు చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. అన్నారు. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టులో 20 మంది వరకూ డిప్యూటీ రిజిస్ట్రార్‌లు వీరిలో ఒకరు సురేంద్రనాథ్‌. మెమన్‌ డెత్‌ వారంట్‌ పిటిషన్‌ను ఫైల్‌ చేసిన సమయంలో విధులు నిర్వహించింది కూడా ఈయనే.