ఆ తీర్పు వెనక్కి తీసుకున్న చెన్నై హైకోర్టు
చెన్నై,జులై11(జనంసాక్షి): రేపిస్ట్‌కు బెయిల్ ఇచ్చి, మధ్యవర్తిత్వం ద్వారా బాధితురాలిని కలుసుకోవాలంటూ గత నెల పదిన ఆదేశించిన మద్రాస్ హైకోర్టు తన తీర్పును రద్దు చేసింది. అంతేకాదు రేపిస్ట్‌కు గతంలో తాను జారీ చేసిన మధ్యంతర బెయిల్‌ను కూడా జస్టిస్ దేవదాస్ రద్దు చేశారు. రేపిస్ట్‌ను కడలూరులోని మహిళా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించారు. గతంలో ఇచ్చిన తీర్పుపై తీవ్ర విమర్శలతో పాటు సుప్రీంకోర్టు నుంచి అక్షింతలు కూడా పడటంతో మద్రాస్ హైకోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. బెయిల్ నుంచి బయటకు వచ్చిన రేపిస్ట్ బాధితురాలిని పెళ్లి చేసుకుంటాననడం, ఆ తర్వాత ఆమె తిరస్కరించడం జరిగిపోయాయి. బాధితురాలు మైనర్‌గా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె ఓ బాలికకు జన్మనిచ్చింది. రేపిస్ట్‌తో వివాహానికి ఆమె నిరాకరించింది.