ఆ ముగ్గురు బయటివాళ్లే..

 

విదేశాల నుంచి వస్తున్న వారికే కరోనా

తెలంగాణలో ఒక్క కేసూ లేదు

ఆర్టీసీ, రైల్వేల్లో పారిశుద్యానికి పెద్దపీట

రాష్ట్రంలో ఆరు ల్యాబ్లు సిద్ధం

మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి

హైదరాబాద్,మార్చి 17(జనంసాక్షి): తెలంగాణ వాసులకు ఒక్కరికి కూడా కరోనా సోకలేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకే పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో వ్యక్తికి కరోనా పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఇప్పటి వరకు ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అన్ని రాష్ట్రాల కంటే ముందే రాష్ట్రంలో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఎయిర్ పోర్టులో 66,162 మందికి రామ్మోహన్ స్క్రీనింగ్ చేశామని తెలిపారు. 4,160 మంది కరోనా అనుమా నితులకు టెస్టు చేశామని చెప్పారు. బుధవారం సాయంత్రం నుంచి యూఏఈ విమానాలు నిలిపివేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరో నా లక్షణాలు ఉన్నవాళ్లను గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నామన్నారు. చైనా, ఇరాన్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ నుంచి వచ్చే వాళ్లను వికారాబా లోని క్వారంటైల్ సెంటర్‌కు తరలిస్తామని ఈటల స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో శానిటైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్టీసీ బస్సులో శానిటైజ్ చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. బస్సులలో సీట్లు, హ్యాండిల్స్ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని ఆయన సూచించారు. బస్సుల్లో శానిటైజర్ బాటిల్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రయాణికులు చేతులు కడుక్కునేలా చూడాలని మంత్రి అజయ్ పిలుపు నిచ్చారు. ఖమ్మంలో ఈ మేరకు అధికారులతో ఆయన సమీక్షించారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. కొన్ని రోజుల పాటు బయోమెట్రిక్ మెషీన్ ను ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు శుభ్రంగా ఉంచాలని.. శుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ బొంతు రామ్మోహన్ హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ ఆఫీసుల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నామని రామ్మోహన్ చెప్పారు. రాష్ట్రంలో 6 ల్యాబ్లు సిద్ధంగా ఉన్నాయి కరోనాకు సంబంధించి ఇకపై రాతపూర్వక బులెటిన్లు విడుదల చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ లో మీడియాతో ప్రభుత్వ ఆదేశాలు అనుసరించని ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదని మంత్రి స్పష్టం చేశారు. దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులకు పాజిటివ్ వచ్చిందని చెప్పారు. పలు దేశాల నుంచి వచ్చే వ్యక్తులకు విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ చేస్తున్నామని.. దీనిలో భాగంగానే చైనా, ఇరాన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా నుంచి వచ్చే వ్యక్తులకు స్కీనింగ్ చేస్తున్నట్లు ఈటల వివరించారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.కరోనా లక్షణాలు లేనివారిని దూలపల్లి, వికారాబాద్ లో 14 రోజులపాటు క్వారంటైలో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే వారిని క్వారంటైన్లో ఉంచుతున్నామన్నారు. ఇప్పటివరకు దాదాపు 200 మందికి పైగా క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఈటల వివరించారు. హైదరాబాద్ లోని ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లో ల్యాబ్ ట్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. తుది పరీక్షల కోసం ఇప్పటివరకు పుణె పంపించాల్సి వచ్చేదని.. ఇకపై హైదరాబాద్ లోనే తుది పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఈటల తెలిపారు. కరోనా పరీక్షలకు రాష్ట్రంలో 6 ల్యాబ్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయన్నారు. వైద్యారోగ్య శాఖ 200 మంది సిబ్బందిని నియమించి ఇప్పటివరకు విమానాశ్రయాల్లో 66,182 మందిని స్క్రీనింగ్ చేసినట్లు చెప్పారు. అందులో 464 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించామని.. వారిలో ఐదుగురికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించామని మంత్రి ఈటల వివరించారు.

తాజావార్తలు