ఇంకా పూర్తికాని రaరికోన ప్రాజెక్ట్‌

కాలువల నిర్మాణం ఆగడంతో అందని నీరు

కడప,జూలై11(జనం సాక్షి)): కరువు నియోజకవర్గాలలో రాయచోటిది మొదటి స్థానం. రాయచోటి నియోజకవర్గంలోని సంబేప్లలె మండలం, రాజంపేట నియోజకవర్గంలోని సుండుప్లలె మండలం, చిత్తూరు జిల్లా కె.వి.ప్లలె మండలాలకు సాగునీటితో పాటు రాయచోటికి తాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిందే రaరికోన ప్రాజెక్టు. 0.75 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును 2006లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. 2010 నాటికి ప్రాజెక్టు కట్ట, మొరవ పూర్తి అయింది. అయినా ఇప్పటికీ ఈ
ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడడం లేదు. సంబేప్లలె మండలం, సుండుప్లలె మండలాలకు కలిపి 4900 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో తొలుత ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. అదేవిధంగా ఎత్తిపోతల పథకం ద్వారా రాయచోటి పట్టణానికి తాగునీరు ఇవ్వాలనేది కూడా అప్పటి ఉద్దేశ్యం. అయితే ఆ తర్వాత ఆ ప్రతిపాదనలన్నీ అటకెక్కిపోయాయి. ముఖ్యమంత్రిగా రాజశేఖర్‌రెడ్డి ఉన్నపుడు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలైనా.. ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్టును పట్టించుకున్న వారు లేరనే విమర్శలు ఉన్నాయి. 2009లో ముఖ్యమంత్రి అయిన రోశయ్య కాలువల నిర్మాణ పనుల సర్వే కోసం రూ. 17 కోట్లు విడుదల చేశారు. అప్పట్లో సర్వే పనులు కూడా పూర్తి అయ్యాయి. అయితే ఇప్పటికీ కాలువల పనులు మొదలు కాలేదు. రోశయ్య అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే.. రaరికోన ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యం పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. కాలువల ఊసు లేకుండా.. ఈ ప్రాజెక్టు నుంచి పీలేరు నియోజకవర్గానికి తాగునీళ్ల పేరుతో తీసుకెళ్ళిపోయారు. దీంతో రaరికోనపైన ఈ ప్రాంత రైతులు ఆశలు వదిలేసుకున్నారని చెప్పవచ్చు. అయితే 2014 ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టు నుంచి సుండుప్లలె మండలానికి గ్రావిటీ ద్వారా కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా ఈ ప్రాజెక్టు గురించి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా కాలువల నిర్మాణం జరిగితే సుండుప్లలె మండల రైతులకు ఉపయోగం ఉంటుంది. మండలంలో పలు గ్రామాలలోని చెరువులకు నీళ్లు ఇవ్వడంతో పాటు.. పలు తాగునీటి పథకాలను కాపాడవచ్చు. ఇటీవల రాయచోటి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.40 కోట్లతో సంబేప్లలె మండలానికి సాగు, తాగునీళ్లు ఇచ్చే లక్ష్యంతో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఇదే సమయంలో గ్రావిటీ ద్వారా కాలువలు నిర్మిస్తే.. తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సుండుప్లలె రైతులు కోరుతున్నారు.