ఇంకా విషమంగానే మధులిక ఆరోగ్యం

కృత్రిమ శ్వాసతో చికిత్స ఇస్తున్నాం
యశోదా వైద్యుల వెల్లడి
హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయప యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆస్పత్రి వైదులు ప్రకటించారు. ఆమెను కృత్రి శ్వాస అందించి చికిత్స చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ మధులికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఇంకా రక్తాన్ని ఎక్కిస్తూనే ఉన్నామన్నారు. ఇంకా రక్తం అవసరం ఉందని.. ఏ గ్రూప్‌ రక్తం వారైనా సరే.. రక్తదానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. మధులిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, నిన్నటితో పోలిస్తే కొంత మెరుగ్గా ఉన్న ఇంకా ఆందోళనకరంగానే ఉందని మరో 24 గంటలు దాటితే కానీ ఏవిూ చెప్పలేమని డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్‌పైనే ఉండడం వల్ల ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమన్నారు. బీపీని నిలకడగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశామని,
వసరమైన సర్జరీలు చేయాల్సి ఉందన్నారు. దాడిలో మెదడుకు తీవ్ర గాయమైందని ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ ద్వారా ఆ విషయం బయటపడిందన్నారు. బ్రెయిన్‌ సర్జరీ చేయాల్సి ఉందని, దాడికి వినియోగించిన కత్తి తుప్పు పట్టి ఉండటంవల్ల ఆమె శరీరంలో తీవ్ర ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. రిపోర్టులూ
నార్మల్‌గా ఉన్నట్లు వస్తే ఆమెకు అవసరమైన సర్జరీలు చేస్తామని డాక్టర్లు పేర్కొన్నారు.