ఇంకొంతకాలం ఓపిక పట్టండి

C
– జర్నలిస్టుల సమస్యలపై మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఆగస్టు 26(జనంసాక్షి): ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లే అయినందున సమస్యల పరిష్కారం విషయంలో కొంత సమయం పడుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ అర్థంచేసుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కొత్తగా మనకంటే ముందుకు ఏర్పడ్డ అనేక రాస్ట్రాలు ఇంకా కుదురుకోలేనేలేదన్నారు. ఈ దశలో తెలంగాణ కుదురుకుని ముందుకు సాగుతున్న వేళ సమస్యలను ఒక్కొక్కటిగా పరిస్కరిస్తున్నామని అన్నారు. అలాగే తెలంగాణలోని జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామనిమంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో ఫోటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మంత్రి కేటీఆర్‌, ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం. ఇండ్ల స్థలాలు, హెల్త్‌ కార్డుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. అందరిలాగే ఫోటో, వీడియో జర్నలిస్టులకు సమాన హక్కులకు కల్పిస్తామన్నారు. పదవుల కోసమే తాము లేమని, అవి తమకు ఎడమకాలి చెప్పుతో సమానమని అన్నారు. వాటిని త్యజించడానికి ఎప్పుడూ సి/-దదంగా ఉన్నామని అన్నారు. కొందరు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లేలా రాస్తున్నారని అన్నారు. వారిని ఏమనాలో తెలియదన్నారు. వాడరాని భాషలో తిట్టినా అలాగ రాస్తున్నారని అన్నారు. ఇది సరికాదన్నారు. గతంలో డెస్క్‌లో ఫిల్టర్‌ జరిగేదని, ఇప్పుడలా జరగడం లేదన్నారు.  జర్నలిస్టు సంఘాలు ఉనికి కోసం ధర్నాలు చేయొద్దన్నారు.  జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తున్న తరుణంలో కొందరు ధర్నాఉ చేయడం సరికాదన్నారు.  సందర్భం లేకుండా, డిమాండ్‌లో న్యాయం లేకుండా ధర్నాలు చేయడం సబబు కాదు. కొన్ని పత్రికలు ఇప్పటికీ తెలంగాణపై విషపు రాతలు రాస్తున్నాయి. తెలంగాణ స్థిరపడి అభివృద్ధిలో ముందుకెళ్తున్నది. మనం అభివృద్ధిలో దేశంలో నెంబర్‌వన్‌గా ఉన్నాం అని తెలిపారు. అనంతరం ఫోటో జర్నలిస్టులకు మంత్రి బహుమతులను ప్రదానం చేశారు.