ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. కేంద్రాలను సందర్శించిన ఆర్డిఓ చెన్నయ్య, డీఎస్పీ వెంకటగిరి :

 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి మార్చి 15పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. మిర్యాలగూడ పట్టణంలోని ఏడు పరీక్ష ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీ గౌతమి జూనియర్ కళాశాల, వాగ్దేవి జూనియర్ కళాశాల, సీనాప్సి జూనియర్ కళాశాల, బైపాస్ వద్ద గల టీఎస్ గురుకులా జూనియర్ కళాశాల (టీఎస్ డబ్ల్యూఆర్ఎస్), కేఎల్ఎన్ బాలికల (సాకేత) జూనియర్ కళాశాల, కేఎల్ఎన్ బాలుర జూనియర్ కళాశాల కేంద్రాలలో ప్రశాంతంగా పరీక్షలు ప్రారంభమయ్యాయి అధికారులు పేర్కొన్నారు. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలో అనుమతి లేదని నిబంధన ఉండడంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు వేసవి దృష్ట్యా విద్యార్థుల కోసం తాగునీటితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మిర్యాలగూడ పట్టణంలోని పరీక్షా కేంద్రాలను ఆర్డిఓ బి. చెన్నయ్య, డీఎస్పీ వెంకటగిరి లు సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరు, ఏర్పాట్లు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. అదేవిధంగా ఇంటర్ మీడియట్ స్క్వాడ్ అధికారులు కేంద్రాలను సందర్శించారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు విద్యార్థులకు సౌకర్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపారు.