ఇంటింటా ఎమ్మెల్యే నరేందర్ ఎన్నికల ప్రచారం
వరంగల్ ఈస్ట్,అక్టోబర్ 15(జనం సాక్షి)
మునుగోడు ఉప ఎన్నికలో బాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా 14 వ వార్డు కాటమయ్య గుడి ఏరియా,గణేష్ నగర్,మల్లికార్జున స్కూల్ వీదిలలో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించి,టీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు