ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి జోగు
ఆదిలాబాద్,నవంబర్6(జనంసాక్షి): మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్‌లోని ఖానాపూర్ అంబేడ్కర్ కాలనీలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, కాలనీ వాసులు, వృద్ధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా వృద్ధులతో కలిసి కింద కూర్చొని వారి సమస్యలను మంత్రి తెలుసుకున్నారు. ప్రచారానికి వచ్చిన మంత్రిని వృద్ధులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ కిట్ వచ్చిన బాలింతతో మాట్లాడి.. ఊయలలో ఉన్న చిన్నారిని మంత్రి ఎత్తుకున్నారు. కాలనీలో టీఆర్‌ఎస్ కార్యకర్త పుట్టిన రోజు సందర్భంగా కేట్ కట్ చేసి కార్యకర్తలకు మంత్రి కేక్ తినిపించారు. ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది కార్తిక మాసంలో తరతరాలుగా ఆచారాలను కాపాడుకుంటూ ఈ ఉత్సవాలను జరుపుకొంటున్నారన్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురంభీం ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఆ మహానీయుని వర్ధంతికి మొదటి సారిగా సీఎం కేసీఆర్ హాజరయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జోగు రామన్న అన్నారు.