ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అవినీతి రహిత దేశం కోసం అవగాహన సదస్సు

కొత్తగూడ నవంబర్ 3 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో వేలుబెల్లి గ్రామ ప్రజలకు అవినీతి నిర్మూలన పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బాలజ్యోతి మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు ఈనెల 6 వరకు అవినీతి రహిత దేశం కోసం గ్రామాలలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.లంచం ఇవ్వడం,తీసుకోవడం రెండు నేరాలు చేయడమేనని ఖాతాదారులకు వివరించారు.భారతదేశంలో అవినీతిని పారదోలాలని పిలుపునిచ్చారు.దేశ ప్రగతికి ప్రధాన అవరోధం అవినీతి దాన్ని నివారించితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.అన్ని రంగాల ఉద్యోగులు నిజాయితీ,నిష్పక్షపాతంగా తమ విధులు నిర్వహిస్తే వారు పని చేస్తున్న సంస్థ ప్రగతి పథంలో
దూసుకు వెళ్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మి, ఉపసర్పంచ్ సురేష్ బ్యాంకు సిబ్బంది అసిస్టెంట్ మేనేజర్ రాంబాబు,భద్రయ్య,గోపి,వంశీ,బ్యాంక్ మిత్రలు లక్ష్మణ్,రాజు,శివ,శ్రీరాములు,సారంగపాణి,మహేందర్,మహిళా సంఘలు,బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు.