ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నేడు జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌


హాజరుకానున్న జాతీయ స్థాయి నేతలు, సీఎంలు, ప్రజాప్రతినిధులు
న్యూఢల్లీి, ఆగస్ట్‌ 20 (జనంసాక్షి) : ఇండియా కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నేడు జస్టిస్‌ బి సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అందుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఉప రాష్ట్రపతి ఎన్నిక దరిమిలా ఇండియా కూటమి అనూహ్యంగా బి సుదర్శన్‌రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం విదితమే. అందులోభాగంగా నేడు నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు చెందిన జాతీయ స్థాయి నేతలు, ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేడు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ నుంచి ఢల్లీికి పయనమవుతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.