ఇండ్లు లేని నిరుపేదలకు మూడు లక్షల హామీ ఏమైంది
నూతన పింఛన్ మంజూరులో జాప్యాన్ని వీడాలి
– లబ్ధిదారులకు వెంటనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి
– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్
కొమురవేల్లి : జనం సాక్షి కేంద్ర, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ విమర్శించారు. గురువారం కొమురెల్లి మండల కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో మండల సహాయ కార్యదర్శి బూరుగు సత్తయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అందె అశోక్ హాజరై మాట్లాడుతూ.. ఎన్నికల ముందు పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. పాలకులు రెండవ సారి అధికారం చేపట్టి 8 సంవత్సరాలు గడిచినా ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయల సహాయం చేస్తామన్న హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. అర్హులైన లబ్ధిదారులు కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని సంవత్సరాలు గడుస్తున్నా మంజూరు మంజూరుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. నూతన రేషన్ కార్డుల మంజూరుకై ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని కొన్నాళ్లు గడుస్తున్న అప్డేట్ కాకపోవడం కారణంగా లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ పార్టీగా గ్రామ గ్రామాన తిరిగి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల కార్యవర్గ సభ్యులు తాడూరు వెంకట్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉడుగుల శ్రీనివాస్, సీపీఐ మండల కోశాధికారి కొంక ఎల్లయ్య, కుడిక్యాల సంతోష్, మొగుళ్ల నర్సయ్య, మొగుల్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.