ఇంత నిర్లక్ష్యమా….

కొల్చారం కస్తూరిబా పాఠశాలలో పురుగుల టిఫిన్,, భోజనం, స్నాక్స్…
*ఇదేంటని ప్రశ్నించిన విద్యార్థులను కర్రలతో , బెల్టుతో బాదుతున్న ఉపాధ్యాయులు.
*విషయం బయటకు చెప్పితే అంతు చూస్తామని విద్యార్థులకు బెదిరింపులు
*భయంతో వనికి పోతున్న విద్యార్థులు.
జనం సాక్షి కొల్చారం:
వారంతా నిరుపేద కుటుంబాలకు చెందిన గిరిజన విద్యార్థినులు… కస్తూరిబా పాఠశాలలో చేరితే తమ భవిష్యత్తు బాగుపడుతుందని ఆశతో వారంతా కొల్చారం కస్తూరిబా పాఠశాలలో చేరారు. విద్యార్థుల వసతి భోజనం కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఇచ్చిస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కస్తూరిబా పాఠశాల విద్యార్థులు ప్రతిరోజు ఉదయం పురుగుల తో కూడిన టిఫిన్, మధ్యాహ్నం పురుగులతో కూడిన అన్నం , సాయంత్రం కూడిన స్నాక్స్ తినాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలకు నిత్యవసర వస్తువులు సరఫరా చేసే గుత్తేదారు నాసిరకం వస్తువులు సరఫరా చేస్తుండడంతో అవి పురుగులు పట్టాయి వీటిని శుభ్రం చేయాల్సిన శుభ్రం చేయాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో విద్యార్థులు పురుగులతో కూడిన టిఫిన్ చేయాల్సిన పరిస్థితి భోజనం చేయాల్సిన పరిస్థితి పాఠశాలలో నెలకొంది. మంగళవారం ఉదయం పాఠశాలలో బొంబాయి రవ్వతో ఉప్మా చేయగా ఉప్మాలో పురుగులు వచ్చాయి అని విద్యార్థులు ప్రశ్నిస్తే ఉపాధ్యాయులు విద్యార్థినులను కిరాతకంగా బెల్టు కర్రలతో కొట్టినట్లు విద్యార్థులు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం ఇచ్చే స్నాక్స్ లో సైతం పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఉపాధ్యాయులు విద్యార్థులను కొట్టడంతో పాటు పరీక్షల్లో ఫెయిల్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయం బయటకు చెప్పిన తల్లిదండ్రులకు చెప్పిన పరీక్షల్లో ఫెయిల్ చేస్తామంటూ బెదిరింపులు చేయడంతో విద్యార్థులు భయంతో గడుపుతున్నట్లు తెలిపారు. పాఠశాలలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది స్నానాలు చేయడానికి సైతం నీరు దొరకక రెండు మూడు రోజులకు ఒకసారి స్నానాలు చేయాల్సిన పరిస్థితి విద్యార్థులకు నెలకొంది వెంటనే జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలను తరలించేసి విద్యార్థులను కొడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని నాణ్యమైన నిత్యవసర వస్తువులు కస్తూర్బా పాఠశాలకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యార్థులు కోరుతున్నారు.

తాజావార్తలు