ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన ప్రత్యేకాధికారి

ఇంద్రవెల్లి: మండలంలోని తుమ్మగూడ, పోచంపల్లి తదితర గ్రామాల్లో ఇందిరమ్మ గృహాలను నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ప్రత్యేకాధికారి కె.నాగేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన్ను ఇందిరమ్మ గృహాలపై పరిశీలన జరిపి లబ్ధిదారులకు బిల్లులు సక్రమంగా అందుతున్నాయా లేదా, గృహ నిర్మాణాలు సకాలంలో పూర్తిచేస్తున్నారా అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రత్యేకాధికారిగా నియమించింది. ఆయా గ్రామాలలో పర్యటించిన ఆయన లబ్ధిదారులను నేరుగా కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట గృహ నిర్మాణ శాఖ ఏఈ అరవింద్‌రాథోడ్‌ సిబ్బంది ఉన్నారు.