ఇందిరా పార్కులో పంచతత్వ పార్కు

మంత్రి కెటిఆర్‌ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): నగరంలో పంచత్తవం/- పార్కు అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్కులో దీనిని నిర్మించారు. ఇందులో భాగంగా మరో 16 పంచతత్వ పార్కులను ప్రారంభించనున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఇందిరా పార్కులో రూ. 16 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పంచతత్వ పార్కును మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి కేటీఆర్‌ ఆదివారం ప్రారంభించారు. ఇందిరాపార్కులో ఒక ఎకరం విస్తీర్ణంలో ఎనిమిది అంశాలతో పంచతత్వ ఆక్యూప్రెజర్‌ వాకింగ్‌ ట్రాక్‌ పార్కును అభివృద్ది చేసారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారి ఇందిరా పార్కులో పంచతత్వ పార్కు ప్రారంభించినట్లు తెలిపారు. రూ.4 కోట్లతో ఇందిరా పార్కును మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలో వినూత్నంగా పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పంచతత్వ పార్కులో 50 రకాల ఔషధ మొక్కలను నాటినట్లు వెల్లడించారు.