ఇంద్రకీలాద్రి కిటకిట
విజయవాడ, జూలై 27 : శ్రావణ శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసింది. రెండో శుక్రవారం..వరలక్ష్మివ్రతం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు దీరారు. కనకదుర్గ అమ్మవారిని వరలక్ష్మి అవతారంలో అలంకరించారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో వాహనాలను ఘాట్‌రోడ్‌పైకి అనుమతించకపోవడంతో భక్తులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యానిర్వాహణ అధికారి రఘునాథ్ తెలిపారు. కాగా కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజాలు చేశారు.