ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్‌ను ఉట్నూరు ఏఎస్పీ అంబర్‌ కిషోర్‌ బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణను, లోపల ప్రతి వస్తువునూ ఆయన పరిశీలించారు. ప్రతి సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ప్రజా ఫిర్యాదులు విభాగం నిర్వహించాలని ఎస్సై బుద్ధస్వామిని ఆదేశించారు. ఈ విభాగంలో తప్పనిసరిగా మహిళా కానిస్టేబుళ్లు పాల్గొనాలని ఆయన తెలిపారు