ఇంధన సామర్థ్యం గల పరికరాలే వాడాలి
ఖమ్మం, అక్టోబర్ 8 : ప్రస్తుతం విద్యుత్ కోరతను అధిగమించేందుకు ఇంధన సామర్థ్యం కలిగిన విద్యుత్ పరికరాలు ఉపయోగించాలని జాయింట్ కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సూచించారు. ఇంధన సామర్థ్యం కలిగిన బల్బులు, ఇతర పరికరాలు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్యార్థులు వసతి గృహాల్లో మాత్రమే వినియోగించాలని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వువు నెంబర్ 132, 133 ప్రకారం ఇంధన సామర్థ్యం కలిగిన పరికరాలే ఉపయోగించాలని అన్నారు. ఇందుకు విరుద్దంగా కొనుగోలు జరిపితే ఖజానా పిఎవో అధికారులు బిల్‌పాస్ చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది.