ఇక కేంద్రం పరిధిలోకి డ్యామ్‌లు
ప్రాజెక్టులను పర్యవేక్షించే నెపంతో పెత్తనం
బిల్లు ఆమోదంతో రాష్టాల్రది ప్రేక్షకపాత్ర
న్యూఢల్లీి,డిసెంబర్3 (జనంసాక్షి) : రాష్టాల్ర పెత్తనంలో ఉన్న ప్రాజెక్టులను కూడా కేంద్రం పరిధిలోకి తీసుకుని వచ్చేందుకు మెల్లగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి తెలుగు రాష్టాల్ల్రో నదీజలాల పంపిణీలపై కేంద్రం అజమాయిషీలోకి తీసుకుంది. రాష్టాల్ర మధ్య విభేదాలను సాకుగా చూపి తన ఆధీనంలోకి తీసుకుంది. తాజాగా డ్యాం సేప్టీ బిల్లును పార్లమెంటులో ఆమోదించడం ద్వారా ప్రాజెక్టులపై కేంద్ర పెత్తనానికి రాజముద్ర పడిరది. డ్యాములు రాష్ట్ర పరిధిలోని అంశమని, వాటి పై కేంద్రం చట్టాలు చేయజాలదని విపక్షాలు స్పష్టం చేశాయి. డ్యాముల భద్రత, నిర్వహణను రాష్టాల్రు చూసుకోగలవని తెలిపారు. కానీ, ప్రతిపక్షాల ఆందోళనలను పట్టించుకోకుండానే దేశంలో నిర్దిష్ట డ్యాముల భద్రతకు సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న బిల్లును రాజ్యసభ ఆమోదించింది. విపత్తులు నివారించడానికి దేశంలోని నిర్దిష్ట డ్యాములపై నిఘా పెట్టడం, తనిఖీ చేయడం, ఆపరేషన్, నిర్వహణ తదితరాలను చూడడమే బిల్లు లక్ష్యంగా కేంద్రం పేర్కొంది. ఇందుకు జాతీయ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు డ్యాముల భద్రతకు సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమూ ఇందులో భాగమే. ప్రస్తుతం తెలుగు రాష్టాల్ల్రోని డ్యాములను బోర్డుల ద్వారా కేంద్రం తన అధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు ఆమోదంతో నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ ఏర్పడుతుందని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన రాష్టాల్రు, వ్యక్తులపై జరిమానాలు విధించే అధికారం ఆ యంత్రాంగానికి ఉంటుందని చెప్పారు. ఇక, డ్యాముల భద్రతపై జాతీయ కమిటీ జాతీయ స్థాయిలో మేథో మధన విభాగంగా పని చేస్తుందని చెప్పారు. దాని సిఫారసుల అమలును నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ, ఎన్సీడీఎస్ వంటి విభాగాలనే రాష్ట్ర స్థాయిలోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్యాములు కొట్టుకుపోయినప్పుడు భారీగా ప్రాణ నష్టం జరుగుతోందని, ఇటువంటి సమయంలో విధుల గురించి ఆలోచించాలి తప్పితే హక్కుల గురించి కాదని హితవు పలికారు.