ఇక ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేని నగరంగా హైదరాబాద్‌

4

మల్టీలెవల్‌ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం

హైదరాబాద్‌,మే30(జనంసాక్షి): హైదరాబాద్‌ మహానగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్న టీఆరెస్‌ సర్కారు ఆదిశగా పనులు వేగవంతం చేస్తోంది. హైదరాబాద్‌ నగర వాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ సమస్యను రూపుమాపేందుకు, నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌ లో రద్దీగా ఉండే పలు జంక్షన్‌, చౌరస్తాలలో మల్టీలెవల్‌ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌ లోని ఉప్పల్‌, హైటెక్‌ సిటీ, కేబీఆర్‌ పార్క్‌, ఫిల్మ్‌నర్‌, క్యాన్సర్‌ హాస్పిటల్‌, జూబ్లీ చెక్‌పోస్ట్‌, ఎల్బీనగర్‌ సహా 20 ముఖ్యమైన చౌరస్తాలు, జంక్షన్లలో మల్టీలెవల్‌ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. ప్రతిపాదిత ఫ్లై ఓవర్ల  ప్రాజెక్టు తుది రూపు కోసం టీఆర్‌ఎస్‌ సర్కారు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నలుగురు సభ్యులు ఉండ  ఈ కమిటీకి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ చైర్మన్‌ గా వ్యవహరిస్తారు.