ఇచ్చే పెన్షన్లో గండికొడుతూ పెన్షన్ దారులను ఇబ్బందులకు గురిచేస్తున్న రమేష్

-రమేష్ పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ పెన్షన్లదారుల ఆవేదన

మహబూబాబాద్ జిల్లా బ్యూరో-జులై27(జనంసాక్షి)

వచ్చే పెన్షన్లో గండి కొడుతూ పెన్షన్ దారులను నానా ఇబ్బంది పెడుతున్న పోస్ట్ కార్యాలయ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని సీతంపేట, అంకన్నగూడెం, బాలాజీ తండా, శేరిపురం పెన్షన్ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పోస్ట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న భూక్య రమేష్ పెన్షన్ ఇచ్చేందుకు తనకు నచ్చిన చోటుకు రమ్మంటూ రవాణా ఖర్చులే ఇబ్బందిగా మారుతుంటే వచ్చే పింఛన్ లో ఒక్కో పెన్షన్ దారినుండి 16రూపాయలు వసూలు చేస్తూ తను చెప్పిన చోటికి ఆటోలు కట్టుకోచి పూటలతరబడి వేచి చూసి ఫోన్ ద్వారా ఎప్పుడొస్తారని అడిగిన పింఛన్ దారులతో దురుసుగా ప్రవర్తిస్తూ నోటికొచ్చిన మాటల్లా అంటూ బాధిస్తున్నదని పించన్ దారులూ ఆవేదన చెందారు. రమేష్ ను వివరణ కోరగా నాకు నాలుగు సెంటర్లు ఉన్నాయి నాకు నచ్చినప్పుడు ఇస్తా వారివద్దకు వెళ్లి పింఛన్ ఇస్తున్నందుకే 16రూపాయలు వసూలు చేస్తున్నానంటూ మాటలు దాటేస్తున్న విధానం తన దోపిడికి నిదర్శనంగా కనిపిస్తుంది. సీతంపేట, అంకన్నగూడెం, బాలజితండా, శేరిపురం గ్రామాల పెన్షన్ దారులు తమ ఖాతాను గార్ల పోస్ట్ కార్యాలయానికి అనుసంధానం చేసినా కనీసం ఒక దారి ఖర్చులతో బయటపడి సరైన సమయానికి పెన్షన్ తీసుకుంటామని కోరారు. వారిని ఇబ్బంది పెట్టిన రమేష్ పై చర్యలు తీసుకుని వారినుండి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు.