ఇజ్రాయెల్‌పై హమాస్‌ భీకరదాడి

` 20 నిమిషాల్లోనే 5వేల రాకెట్ల ప్రయోగం
` సైనికులను,పౌరులను నిర్భంధించిన మిలిటెంట్లు
` దాడితో అప్రమత్తమైన అయిన ఇజ్రాయెల్‌
` ఇరువైపులదాడుల్లో 300 మందికిపైగా మృతి
` మా దేశం యుద్ధంలో ఉంది
:ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ
` ‘ఆపరేషన్‌ అల్‌ అక్సా ఫ్లడ్‌’లో భాగంగానే దాడి
` ప్రకటించిన హమాస్‌ నాయకుడు మహ్మద్‌ దీఫ్‌
` తీవ్రంగా ఖండిరచిన ప్రపంచదేశాలు
` అండగా ఉంటాం: ప్రధాని మోడీ

గాజా(జనంసాక్షి):ఇజ్రాయిల్‌పై హమాస్‌ యుద్దానికి దిగింది. మెరుపుదాడితో బీభత్సం సృష్టించింది. ఇజ్రాయిల్‌ విూదకు సుమారు 5 వేల రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్‌ గ్రూపు తెలిపింది. ఆ దేశంపై ఆపరేషన్‌ అల్‌ అక్సా ఫ్లడ్‌ చేపట్టినట్లు హమాస్‌ వెల్లడిరచింది. గాజా స్టిప్ర్‌ నుంచి ఇజ్రాయిల్‌ నగరాల దిశగా కేవలం తొలి 20 నిమిషాల్లోనే దాదాపు 5 వేల రాకెట్లను ఫైర్‌ చేసినట్లు హమాస్‌ వెల్లడిరచింది. సుమారు రెండు గంటల పాటు ఆ పైరిరగ్‌ ఏకధాటిగా కొనసాగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్‌, పాలస్తీనా మధ్య ఉన్న వైరం మరింత ముదిరింది. పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఆధిపత్యం చెలాయిస్తున్న హమాస్‌ మిలిటెంట్లు పలు వాహనాల్లో ఇజ్రాయిల్‌ దక్షిణ ప్రాంతంలోని సరిహద్దు పట్టణాల్లోకి ప్రవేశించారు. స్డెరోట్‌లో తపాకులతో ఇజ్రాయిల్‌ పౌరులపై కాల్పులు జరిపారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అయ్యింది. అలాగే హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌ సైనికుల మృతదేహాలను వీధుల్లోకి ఈడ్చుకెళ్తూ సంబరాలు జరుపుకున్న వీడియో క్లిప్‌లు కూడా సోషల్‌ విూడియాలో కనిపించాయి.కాగా, శనివారం హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై విరుచుకుపడ్డారు. గాజా నుంచి ఐదు వేల రాకెట్లు ప్రయోగించారు. దేవుడి సహాయంతో అన్ని సమస్యలకు ముగింపు పలకాలని నిర్ణయించినట్టు హమాస్‌ సంస్థ నాయకుడు మహ్మద్‌ దీఫ్‌ తెలిపారు. ఆపరేషన్‌ ’అల్‌`అక్సా ఫ్లడ్‌’ను ప్రకటించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా తొలి 20 నిమిషాల్లో 5,000 క్షిపణులు, షెల్స్‌ను ఇజ్రాయిల్‌పైకి ప్రయోగించినట్లు వెల్లడిరచారు.దక్షిణ బోర్డర్‌ వద్ద హమాస్‌ విధ్వంసానికి దిగడంతో.. ఇజ్రాయిల్‌ అప్రమత్తమైంది. యుద్ధాన్ని ప్రకటిస్తూ రణగర్జన చేసింది. హమాస్‌ మిలిటెంట్లు చొరబడిన ప్రాంతాల్లో ఐడీఎఫ్‌ దళాలు రంగంలోకి దిగాయి. పాలస్తీనాలోని హమాస్‌ గ్రూపు మిలిటెంట్లను.. ఇజ్రాయిల్‌లో ఉగ్రవాదులుగా భావిస్తారు. ఆ అటాక్‌ కోసం ఉగ్రవాదులు పారాగ్లయిడర్స్‌ కూడా వాడినట్లు తెలుస్తోంది. త్వరలోనే సెక్యూర్టీ చీఫ్‌లతో విూటింగ్‌ను ఏర్పాటు చేయను న్నట్లు ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతాన్యహూ తెలిపారు. హమాస్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని కార్యాలయం తెలిపింది. హమాస్‌ అటాక్‌ నేపథ్యంలో గాజా స్టిప్ర్‌ వద్ద ఉన్న 80 కిలోవిూటర్ల పరిధిలో ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలెంట్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోవైపు రాకెట్లతో హమాస్‌ దాడి చేయడంతో ఇజ్రాయిల్‌ అప్రమత్త మైంది. ఎయిర్‌ ఢఫిెన్స్‌ ద్వారా హమాస్‌ క్షిపణులను ఎదుర్కొన్నది. అలాగే హమాస్‌పై యుద్ధాన్ని ప్రకటించింది. హమాస్‌ మిలిటెంట్లు చొరబడిన సరిహద్దు ప్రాంతాల్లో ఐడీఎఫ్‌ దళాలను రంగంలోకి దించింది. గాజా స్టిప్ర్‌ సరిహద్దులోని 80 కిలోవిూటర్ల పరిధిలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇజ్రాయిల్‌పై దాడులకు పాల్పడిన హమాస్‌, ఆ దేశ సైనికులతోపాటు, పౌరులను బంధీలుగా తీసుకెళ్లింది. ఆపరేషన్‌ ’అల్‌` అక్సా ఫ్లడ్‌’లో భాగంగా అనేక మంది ఇజ్రాయిల్‌ సైనికులను నిర్బంధించినట్లు మాస్‌కు చెందిన అల్‌ కాస్సామ్‌ బ్రిగేడ్స్‌ ప్రకటించింది.  సజీవంగా పట్టుకున్న వారి ఫొటోలు, గాజాలోకి తరలిస్తున్న వీడియోలను రిలీజ్‌ చేసింది. అలాగే హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌ మహిళ నగ్న మృతదేహాన్ని ఒక వాహనంలో తరలించిన వీడియో క్లిప్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అయ్యింది.  సంఘటనలను ఈయూ విదేశాంగ విధాన చీఫ్‌ జోసెప్‌ బోరెల్‌ ఖండిరచారు. ఇజ్రాయిల్‌ పౌరులను అపహరించి నిర్బంధించడం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఎక్స్‌లో పేర్కొన్నారు. కాగా, శనివారం హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. గాజా నుంచి ఐదు వేల రాకెట్లు ప్రయోగించారు. సుమారు 20 మందికిపైగా మరణించగా 500కుపైగా గాయపడ్డారు. దీంతో ఇజ్రాయిల్‌ అప్రమత్తమైంది. ఎయిర్‌ ఢఫిెన్స్‌ ద్వారా హమాస్‌ క్షిపణులను ఎదుర్కొన్నది. అలాగే హమాస్‌పై యుద్ధాన్ని ప్రకటించడంతోపాటు ఆపరేషన్‌ ఐరన్‌ స్వార్డ్స్‌తో ఎదురుదాడి ప్రారంభించింది.
ఇజ్రాయిల్‌పై దాడితో బారత్‌ అప్రమత్తం
ఇజ్రాయిల్‌పై హమాస్‌ దాడి నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఇజ్రాయిల్‌లోని భారత పౌరుల భద్రత కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు సూచనలు జారీ చేసింది.  భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటించాలని తెలిపింది. ఇజ్రాయిల్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ఒక నోటీస్‌ జారీ చేసింది. ’ఇజ్రాయిల్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ దేశంలోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటించాలి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. అనవసర కదలికలు నివారించండి. సెఫ్టీ షెల్టర్స్‌ వద్దకు వెళ్లండి. అదనపు సమాచారం కోసం ఇజ్రాయిల్‌ హోమ్‌ ఫ్రంట్‌ కమాండ్‌ వెబ్‌సైట్‌ లేదా వారి బ్రోచర్‌ను చూడండి’ అని పేర్కొంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఇండియన్‌ ఎంబసీ హెల్ప్‌లైన్‌ నంబని, ఇమెయిల్‌ ద్వారా సంప్రదించాలని ఇజ్రాయిల్‌లోని భారతీయ పౌరులను కోరింది. ఎలాంటి సహాయమైనా అందించేందుకు ఎంబసీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.కాగా, శనివారం హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. గాజా నుంచి ఐదు వేల రాకెట్లు ప్రయోగించారు. ఇజ్రాయిల్‌లో ప్రజలు పదుల సంఖ్యలో మరణించగా వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌ అప్రమత్తమైంది. ఎయిర్‌ ఢఫిెన్స్‌ ద్వారా హమాస్‌ క్షిపణులను ఎదుర్కొన్నది. అలాగే హమాస్‌పై యుద్ధాన్ని ప్రకటించడంతోపాటు ఎదురుదాడి కోసం ఆపరేషన్‌ ఐరాన్‌ స్వార్డ్స్‌ చేపట్టింది.
మా దేశం యుద్ధంలో ఉంది:ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ
తాజా పరిస్థితులపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ స్పందిస్తూ.. తమ దేశం ‘యుద్ధం’ ఉందని అధికారికంగా వెల్లడిరచారు.’’శత్రువులపై ఆపరేషన్లు, కాల్పులు కాదు. మేం యుద్ధం చేస్తున్నాం. ఇజ్రాయెల్‌ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ ఉదయం హమాస్‌ క్రూరమైన మెరుపు దాడికి దిగింది. ఉగ్రవాదులు చొరబాటు చేసిన ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భద్రతా దళాలను ఆదేశించాను. అదే సమయంలో శత్రువులపై కాల్పులు జరిపి వారిని తరిమికొట్టాలని ఆదేశాలు జారీ చేశా. శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో నెతన్యాహూ హమాస్‌ను హెచ్చరించారు. ఈ యుద్ధంలో తప్పకుండా తామే గెలుస్తామని ప్రజలు భరోసానిచ్చారు.
ప్రపంచ దేశాల ఖండన..
ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడికి పలు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. హమాస్‌ అకృత్యాలు తీవ్రగ్భ్భ్రాంతికి గురిచేస్తున్నాయని పలు దేశాలు విచారం వ్యక్తం చేశాయి.’’ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ ఉగ్రవాదుల దాడులు తీవ్రగ్భ్భ్రాంతికరం. తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌కు పోరాడే హక్కు ఉంది. పరిస్థితులపై ఇజ్రాయెల్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. అక్కడి యూకే పౌరులు ప్రయాణ సూచనలను పాటించాలి’’` బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌’’ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడులు అత్యంత తీవ్రమైనవి. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హమాస్‌ ఉగ్రవాదుల అమానుష హింసగ్భ్భ్రాంతికరం’’ ` స్పెయిన్‌ విదేశాంగ మంత్రి జోస్‌ మాన్యూల్‌ అల్బరెస్‌
’’ఇజ్రాయెల్‌, పాలస్తీనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఉద్రిక్తతలను మరింత పెంచేలా దుందుడుకు చర్యలకు దూరంగా ఉండాలి’’` తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌
ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం: మోదీ
ఇజ్రాయెల్‌లో హమాస్‌ మిలిటెంట్ల హింసాత్మక దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ దీనిపై స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రకటించారు.’’ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదులు భీకర దాడుల వార్తలు విని తీవ్రగ్భ్భ్రాంతికి లోనయ్యా. ఈ సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలన్నీ.. బాధిత పౌరులు, వారి కుటుంబాల గురించే. ఈ విపత్కర పరిస్థితుల్లో మేం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడుతాం’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.