ఇటలీ ప్రధానిగా ఎన్రికో లెట్టా ఇటలీ ప్రధానిగా ఎన్రికో లెట్టా

ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు నెపోలిటానో ఆహ్వనం
ఇటలీలో కోత్త ప్రభుత్వ ఏర్పాటుకు మధ్యేవాద లెప్ట్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఉప ఎన్రికో లెట్టాను అధ్యక్షుడు జార్జియో నెపోలిటానో ఆహ్వనించారు. గత ఎనిమిది వారాలుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించేందుకు తాను సత్వర చర్యలు తీసుకుంటానని గతంలో ఐరాపా వ్యవహరాలు, పరిశ్రమలు, వీదేశీ వాణిజ్యశాఖల మంత్రిగా పనిచేసిన లెట్టా చెప్పారు. ప్రధానిగా నియమితులైన వెంటనే ఆయన మీడియాతో మాట్లడుతూ తన ప్రభుత్వనికి మద్దతుకోసం వివిధ పార్టీలతో సంప్రదించిన అనంతరం తర్వాలోనే తిరిగి అధ్యక్షుడిని కలుస్తానని చెప్పారు. ప్రదానిగా బాధ్యతలు స్వీకరించేందుకు పారిశ్రామిక సంస్కరణల అమలుకు చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. అదే విధంగా ‘పొదుపు’ చర్యల పై కూడా తాను దృష్టి పెడతానన్నారు. అంతకు ముందు లెట్టా ప్రదానిగా నియమితు లవుతారన్న ఊహగానాల మధ్య అధ్యక్షుడు నెపోలిటానో ఆయన్ను తన నివాస భవనానికి పిలిచి ప్రధానిగా నియమించనున్నట్లు చెప్పారు.