ఇడుపులపాయలో వైఎస్‌కు ఘనంగా నివాళి


నివాళి అర్పించిన వైఎస్‌ కుటుంబ సభ్యులు
తండ్రిని తలుచుకుంటూ జగగన్‌ భావోద్వేగ ట్వీట్‌

కడప,జూలై8 (జనం సాక్షి): మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో విజయమ్మ,షర్మిల,భారతి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కోట్లాది మంది చిరునవ్వుల్లో విూ రూపం కనిస్తూనే ఉంటుందని తండ్రిని గుర్తు చేసుకున్నారు. ’నాన్నా.. మిమ్మల్ని ఆరాధించే కోట్ల మంది చిరునవ్వుల్లో నిత్యం విూ రూపం కనిపిస్తూనే ఉంటుంది. ఇచ్చిన మాట, నమ్మిన సిద్దాంతం కోసం ఆఖరి శ్వాస వరకు కట్టుబడి జీవించిన విూ జీవితమే నాకు స్ఫూర్తి. ప్రజా సంక్షేమం కోసం విూరు చేసిన ఆలోచనలు ఈ ప్రభుత్వానికి మార్గదర్శకం’ అని సీఎం జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వైఎస్సార్‌ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అలాగే గుంటూరులోని నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగే వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. మరోవైపు వైఎస్సార్‌ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తోంది