ఇతరులకు ఇబ్బంది కలిగించడం నేరం
ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం చట్టరీత్యా నేరమని స్థానిక ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి అన్నారు. మండలంలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన పుచ్చకాయల సీతారాములు గ్రామకంఠం భూమిలో పట్టాల తో గుడిసె వేయడంతో ఆర్ ఐ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. సదరు వ్యక్తి ఇటీవలే రైతులు నడిచే దారికి అడ్డంగా కంచె కట్టడంతో రెవెన్యూ అధికారులతో వెళ్లి కంచె ను తొలగించడం జరిగిందన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇతరుల ను ఇబ్బంది పెట్టడం సరైనది కాదని అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.