ఇది ఉద్యమాల యుగం

రాజ్యహింసకు వ్యతిరేకంగా ఉద్యమించండి

బుకర్‌ అవార్డు విజేత అరుంధతీరాయ్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి):
ఇది ఉద్యమాల యుగమని, ప్రజలు రాజ్యహింసకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి సమయం ఆసన్నమైం దని ప్రముఖ రచయిత్రి, ప్రతిష్టాత్మక బుకర్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి అరుంధతీ రాయ్‌ పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్భవించిన మహిళా ఉద్యమ సంస్థలన్నీ కాలక్రమేణా స్వచ్ఛంద సంస్థలుగా మారుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన విప్లవ ప్రజాస్వామిక సంఘటన (ఆర్‌డీఎఫ్‌) నిషేధ వ్యతిరేక సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రజాసం ఘాలను అణచివేయాలని చూస్తే అది ప్రతిఘటనకు దారి తీస్తుందని ఆమె చెప్పారు. దేశంలో స్వలింగ సంపర్కంపై మాట్లాడుకుంటున్న జనం సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన మాత్రం చర్చించుకోవడం లేదని అరుధతీ రాయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సంప్రదాయం కొనసాగితే ప్రపంచం అంధకారం లోకి వెళ్లే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు.