ఇదేం దారుణం..!?
– మయన్మార్ వ్యతిరేక తీర్మాణానికి మద్ధతివ్వని భారత్
– హత్యకాండను నిరసిస్తూ తీర్మాణం చేసిన ప్రపంచ పార్లమెంటరీ ఫోరం
ఇండోనేషియా,సెప్టెంబర్ 8,(జనంసాక్షి):ప్రపంచ వ్యాప్తంగా మయన్మార్ లో జరుగుతున్న ఊచకోతను ముక్తకఠంతో ఖడింస్తుండగా అందుకు భారత్ విరుద్దంగా వ్యవహరించింది. ఈ దారుణ మారణకాండను మనసున్న ప్రతి మనిష,ి దేశాలు వ్యతిరేకిస్తుండగా భారత్ విచిత్ర వైఖరి అవలంబించడం విస్మయానికి గురిచేసింది. రోహింగ్యా ముస్లింల సమస్య విషయంలో మయన్మార్ వైఖరిని తప్పుపడుతూ ప్రతిపాదించిన తీర్మానానికి భారత్ మద్దతు తెలపలేదు. ఇండోనేషియాలో జరిగిన ప్రపంచ పార్లమెంటరీ ఫోరం సదస్సులో మయన్మార్వైఖరినిఖండిస్తూ ‘బాలి ప్రకటన’ పేరుతో గురువారం తీర్మానాన్ని ఆమోదించారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆధ్వర్యంలోని భారత బృందం మద్దతు ప్రకటించలేదు. దీన్ని ఎలా సమర్ధించుకుంటారో వేచి చూడాలి.