ఇదేం రాజ్యం.. రాహుల్‌పై అనర్హత వేటు
` భారత రాజకీయాల్లో అనూహ్య పరిణామం
` నోటిఫికేషన్ విడుదలచేసిన లోక్‌సభ సెక్రటేరియట్
` తక్షణమే లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన రాహుల్
` వయానాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత
` అనర్హత వేటుపై న్యాయపోరాటం
` కాంగ్రెస్ అగ్రనేతల కీలక నిర్ణయం
` దేశం కోసమే నా పోరాటం..
` అందుకోసం ఎంత మూల్యానికైనా సిద్ధమే..!:రాహుల్
న్యూఢల్లీి(జనంసాక్షి):భారతీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే భారత్ జోడోయాత్రతో ప్రజల ముందుకు వచ్చిన రాహుల్ లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిరది. ఎంపీగా రాహుల్ గాంధీ చెల్లుబాటు కారని లోక్‌సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యుడిగా అనర్హత పొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై.. లోక్‌సభ సెక్రటేరియేట్ అనర్హత వేటు విధించింది. లోక్‌సభ నుంచి ఆయన్ను డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు అయ్యింది. మార్చి 23వ తేదీ నుంచి అనర్హత వేటు అమలులోకి వస్తుందని లోక్‌సభ సెక్రటేరియేట్ తెలిపింది. ప్రధాని మోదీని ఇంటిపేరుతో దూషించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే.నేరపూరిత పరువునష్టంకేసులో దోషిగా తేలినందు వల్లే రాహుల్‌కు అనర్హత తప్పలేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటేరియేట్ తన లేఖలో పేర్కొంది. దీంతో రాహుల్ గాంధీ 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ప్రస్తుతం రాహుల్ కేరళలోని వయొనాడ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో లోక్‌సభ ఈ నిర్ణయం తీసుకుంది. జైలశిక్ష కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. 2019 కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోడీని కించపర్చే విధంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోడీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ.. సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారించిన కోర్టు… రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాను అలా అనలేదని రాహుల్ వివరణ ఇచ్చారు. అయితే కోర్టు మాత్రం రాహుల్ గాంధీని దోషిగా తేల్చి..రెండేళ్లు జైలు శిక్ష విధించింది. రూ.15 వేల అపరాధం కూడా విధించింది. ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు. ఈ నేపథ్యంలోనే లోక్ సభ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడిరది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది. కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని సూరత్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జుడీషియల్ మేజిస్టేట్ర్ దోషిగా తేల్చడంతో లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హత వేటు పడిరది. దోషిగా తేలిన 23 మార్చి 2023 నుంచి నుంచి అనర్హత వర్తిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(।) ప్రకారం నిర్ణయం తీసుకున్నాం‘ అని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటరీయేట్ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సర్క్యూలర్ జారీ చేశారు. ఈ కేసులో సూరత్ కోర్ట్ ప్రస్తుతానికి కోర్టు 30 రోజుల బెయిల్ ఇచ్చినా తర్వాత ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోతున్నాయి. పై కోర్టులు కనుక సూరత్ కోర్ట్ తీర్పును కొట్టేయకపోతే రాహుల్ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయితే సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
ప్రజల గొంతుకగా పోరాడుతా:రాహుల్
అనర్హత వేటుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను దేశం గొంతు వినిపించేందుకు పోరాడుతున్నానని అన్నారు. దీనికోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్దమని స్పష్టం చెప్పారు. ప్రజల కోసం ఇక పోరాడుతానని అన్నారు. మరోవైపు ఢల్లీిలో కాంగ్రెస్ అత్యవసర సమావేశం నిర్వహించింది. రాహుల్ అనర్హత వేటుపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. ఈ వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న పార్టీ నేతలు న్యాయ పోరాటం చేస్తామని, దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. అంతేకాకుండా చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రధాని మోడీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మార్చి 23న సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఆదేశాల నేపథ్యంలోనే రాహుల్ గాంధీపై వేటు వేసినట్టు లోక్ సభ వెల్లడిరచింది. ఇక పార్టీ నాయకుడిపై ఈ రకమైన చర్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎఐసిసి కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. సోనియాగాంధీ, ప్రియాంక, జైరామ్ రమేశ్, ముకుల్ వాస్నిక్, కెసి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌పై అనర్థపై న్యాయ పోయరాటం చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఇదే సమయంలో ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయి. బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజీవ్రాల్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ శివసేన వర్గం అధినేత ఉద్ధవ్ థాకరేతో పాటు అనేక పార్టీల నేతలు ఇప్పటికే రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ రద్దు చేయడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు ఇష్టపడని నేతలు కూడా రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని తప్పుబట్టారు. బీజేపీయేతర పార్టీల నేతల్లో ఎక్కువ మంది రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఖండిరచారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమంటూ తీవ్రంగా విమర్శించారు. క్రమంగా కాంగ్రెస్‌తో కలిసి ఐక్యపోరాటం చేసేందుకు వీరు సిద్ధమౌతున్నారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆప్ అధినేత కేజీవ్రాల్ పిలుపునీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఇప్పటికే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ తప్పుడు కేసులు పెడుతున్నాయంటూ పిటిషన్ దాఖలు చేశారు.