ఇద్దరు తీవ్రవాదులు అరెస్టు
ఇంపాల్: మణిపూర్ పోలీసులు ఇద్దరు తిరుగుబాటుదారులను అరెస్టు చేశారు. వీరిలో ఒక మహళ ఉంది. అరెస్టయిన వీరిద్దరు కూడా వేర్వేరు తీవ్రవాద సంస్థలకు చెందినవారు. మహరాబి అనే ప్రాంతంలో యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(యూఎన్ఎల్ఎఫ్) మహిళా కేడర్కు చెందిన ఓయిమాన్ రితా(47)ను అరెస్టు చేయగా.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు చెందినబసంతా మైతేయ్ (30) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పలు తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. అసోం రైఫిల్స్, తౌబాల్ ప్రాంత పోలీసులు నిర్వహించిన గాలింపుల్లో వీరిద్దరు తారసపడగా అరెస్టు చేశారు.