ఇద్దరు మంత్రులున్నా జిల్లాకు ఒరిగిందేవిూ లేదు
ప్రచారంలో విమర్శలు గుప్పిస్తున్న రాధోడ్
ఆదిలాబాద్,నవంబర్26(జనంసాక్షి): ఇద్దరు మంత్రులు ఉన్నా జిల్లా అభివృద్దిలో మాల్రం వెనకబడే ఉందని ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్ అన్నారు. సోమవారం ఆయనే ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అనేక సమస్యలు ఉన్నా ఆ ఇద్దరు మతం/-రులు ఏనాడు పట్టించుకోలేదన్నారు. జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిల వల్ల జిల్లా ప్రజలకు ఒనగూరిన ప్రయోజనం లేదన్నారు. ఇద్దరు మంత్రులున్నా పత్తిరైతుల సమస్యలు, మార్కెట్‌యార్డులలో రైతుల ఇబ్బందులను ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. ఆదివాసీ లంబాడీల మధ్య చిచ్చు పెట్టించింది కేసీఆరే అనే ఆరోపించారు. గిరిజనేతరులకు అండగా ఉంటామని, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల భూములకు పహానీలు ఇప్పిస్తామని హావిూ ఇచ్చారు. 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పేదలకు ఉచితంగా 6 వంటగ్యాస్ సిలెండర్లు, ఇందిరమ్మ ఇళ్లకు అదనపు గది కోసం రూ.2లక్షలు, కొత్తగా నిర్మించుకునే వారికి రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు రూ.3వేల చొప్పున 10 లక్షల మందికి ఇస్తామని హావిూ ఇచ్చారు. 58 ఏళ్లకే ఇంట్లో ఎందరు అర్హులుంటే అందరికి ఇస్తామని, తలా 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తామన్నారు. కాంగ్రెస్ హస్తం గుర్తుకు కేవలం ఒక్క ఓటు వేసి ఓటర్లందరూ గెలిపించాలని అభ్యర్థించారు. మహాకూటమిలో ఉన్న మిత్రపక్షాలు తెదేపా, కమ్యూనిస్టు, తెలంగాణ జనసమితి పార్టీల నాయకులకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతికి చంద్రబాబు అడ్డుపడి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలువడం తప్పా ప్రజలారా..అని అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబును విమర్శిస్తున్నారు.