ఇనుగుర్తి లో కలపొద్దని ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు

కోమటిపల్లి,తారాసింగ్ తండా వాసుల ఏకగ్రీవ తీర్మానం
కేసముద్రం జులై 29 జనం సాక్షి /  కొత్తగా ప్రతిపాదిత ఇనుగుర్తి మండలంలో తమ గ్రామాలను చేర్చొద్దని, కేసముద్రం మండలంలోనే యధావిధిగా కొనసాగించాలని కోరుతూ కేసముద్రం మండలం కోమటిపల్లి,తారా సింగ్ తండా గ్రామస్తులు శుక్రవారం ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సర్పంచులు నీలం యాకయ్య,స పావట్ శంకర్ లు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ….చెంతనే ఉన్న కేసముద్రం మండల కేంద్రం పరిధి నుంచి దూర భారమైన ఇనుగుర్తి మండలంలో చేర్చాలని ముసాయిదా ప్రకటన జారీ చేయడం సమంజసంగా లేదని పేర్కొన్నారు.పరిపాలన సౌలభ్యం పేరుతో కొత్త మండలాల ఏర్పాటు పట్ల తమకు వ్యతిరేకత లేదని అయితే అదే తరహాలో తమకు అనుకూలంగా ఉన్న కేసముద్రం మండలం నుంచి కొత్తగా ప్రతిపాదిత ఇనుగుర్తి మండలంలో చేర్చడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.ప్రభుత్వం పునరాలోచించి తమ గ్రామాలను యధావిధిగా కేసముద్రం మండలంలోని కొనసాగించాలని వారు కోరారు. ఈ మేరకు జిల్లా అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి ఇనుగుర్తి మండల విలీన గ్రామాల ప్రతిపాదన నుండి తమ గ్రామాలను తొలగించి కేసముద్రం మండలంలోని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు గడ్డం యాకముర్తి రావుల మల్లేశం, కూరెళ్లి సతీష్, చిరగోని యాక మూర్తి,పూజారి కొమురయ్య, మద్దెల బిక్షపతి, ఉమ్మగాని ఐలయ్య, నీలం వెంకన్న, షేరు శ్రీను, ఆరెందుల మహేశ్వర్, ఇసంపల్లి మల్లయ్య, జల్లే శీను,పూజారి లింగన్న, బండి శ్రీను, గాడిపల్లి రాజయ్య పాల్గొన్నారు. అలాగే తారా సింగ్ తండా గ్రామ సభలో వివిధ పార్టీల నాయకులు మూడవత్ వీరన్న భానోత్ శ్రీను, సపావట్ నంద, బానోతు దేవ, బద్రు, జాటోతు లాలు, భీమ్ సింగ్, రవి, బానోతు వీరన్న, సపావట్ శీను, నునావత్ పరమేష్, బానోత్ జంలా తదితరులు పాల్గొన్నారు