ఇప్పటికీ ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి
ఆహార, ఆహార్యలపైనా ఆంక్షలు పెడుతున్నారు
మీట్ ది ప్రెస్ లో మంత్రి కేటిఆర్
మేం చేసిందే చెప్తున్నాం..
హైదరాబాద్ : బిజెపి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఇప్పటికీ ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మతాల పేరుతో దాడులు జరగడం బాధాకరమైన విషయం అని, బీఫ్ తిన్నా.. గడ్డం పెంచుకున్న.. జైశ్రీరామ్ అనకపోయినా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులమతాలకు సమ ప్రాధాన్యత దక్కుతోందని, వారంతా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ప్రజలకు తాము చేసిందే చెబుతున్నామని.. కానీ ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయో ఏం చేశాయో చెప్పకుండా ప్రజలను ఓట్లు అడుగుతున్నాయని అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.