ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా మంత్రి కేటీఆర్‌

– స్కోచ్‌ అవార్డు ప్రదానం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పడి మూడేళ్లే అయినా సిఎం కెసిఆర్‌ దార్శనికతతో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు దూసుకుని పోతోందని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. రానున్న ఆరునెలల్లో ఇంటంటికి ఇంటర్‌నెట్‌ అందించేందుకు కృషి జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావుకు స్కోచ్‌ జాతీయ అవార్డు దక్కింది. ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో మంత్రి కేటీఆర్‌ ని ప్రముఖ సంస్థ స్కోచ్‌ సన్మానించింది. 49వ స్కోచ్‌ సమ్మిట్‌ సందర్భంగా శనివారం ఢిల్లీలో స్కోచ్‌ అవార్డును కేటీఆర్‌ అందుకున్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నందుకు మంత్రి కేటీఆర్‌ కు ఈ గుర్తింపు దక్కింది. స్కోచ్‌ సమ్మిట్‌ లో తెలంగాణ ఐటీ స్టాళ్లను కేటీఆర్‌ సందర్శించారు. తెలంగాణలో వినూత్న కార్యక్రమాలను తసీఉకుని వెల్లడంద్వారా ముందు వరసలో నిలిపామని అన్నారు. కేటీఆర్‌కు అవార్డు ప్రకటించిన సందర్భంగా.. స్కోచ్‌ సంస్థ చైర్మన్‌ సవిూర్‌ కొచ్చార్‌ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ను పలు సందర్భాల్లో దగ్గరగా గమనించాం. పలు అంశాలపై ఆయన సృజనాత్మకంగా స్పందించిన తీరు ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను సఫలంచేసే రీతిలో మంత్రి కేటీఆర్‌ ముందుకు సాగుతున్నారు. ఐటీ రంగ విశేష వృద్ధికోసం ఆయన పనిచేస్తున్న తీరు నూతన భారతంకోసం కొత్త రాష్టాన్న్రి తీర్చిదిద్దుతున్నట్లుగా ఉంది. ఐటీ పరిశ్రమను వినూత్న పంథాలో ముందుకు తీసుకువెళ్లేందుకు పలు కొత్త విధానాలు రూపొందించడం, కొత్త రోడ్‌ మ్యాప్‌తో మంత్రి కేటీఆర్‌ ముందుకు సాగుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయన మంత్రి పదవి చేపట్టినప్పటినుంచి ఇది స్పష్టమవుతున్నది అని ప్రశంసించారు. అవార్డు గ్రహీత ఎంపికకోసం ఏర్పాటుచేసిన జ్యూరీ బృందం నిపుణులతో కూడుకొని ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నిశితంగా గమనించడంతోపాటు పలువురు అధ్యయనవేత్తలతో కూడిన బృందం వాటిని విశ్లేషించడం, భాగస్వామ్యం పక్షాలతో చర్చించడం, స్కోచ్‌కు అంతర్గత బృందం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. స్కోచ్‌ సంస్థ 2003 నుంచి స్వతంత్రంగా ఆయా రాష్టాల్రను అధ్యయనం చేస్తున్నది. ఆయా సంవత్సరాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రాష్టాల్ర గురించి విశ్లేషిస్తున్నది. ఇలాంటి విశ్లేషణలో గతేడాది అన్ని రంగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సర్కారును గుర్తించి, అవార్డు అందించిన సంగతి తెలిసిందే.ఐటీ పరిశ్రమను వినూత్న రీతిలో ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ అవార్డు ఆయనను వరించిందని స్కోచ్‌ సంస్థ చైర్మెన్‌ సవిూర్‌ కొచ్చార్‌ తెలిపారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్నందుకు ఆయనకు ఈ గుర్తింపు దక్కింది.