ఇరాక్‌లో హింసాకాండ..49 మంది మృతి

కిర్కుక్‌:ఇరాక్‌లో మంగళవారం భద్రతా బలగాలకు, నిరసనకారులకు మద్య జరిగిన ఘర్షణలో 49 మంది మృతిచెందారు. ఘర్షణల నేపథ్యంలో ఇద్దరి సున్నీ మంత్రులు పదవుల నుంచి తప్పకున్నారు. షియా వర్గానికి చెందిన ప్రదాని నూరీ మాలికి.. తమ వర్గం వారిపై జరుగుతున్న  దాడులకు బాద్యత వహించి రాజినామా చేయాలని కిర్కుక్‌ రాష్ట్రం హవిజాలో  ధర్నా చేస్తున్న సున్నీ నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించాయి.  దీంతో ఇరుక్షాల మధ్య ఘర్షణలు  చోటుచేసుకున్నాయి. 25 మంది నిరసనకారులు, ఇద్దరు సైనికులు  చనిపోగా 70 మంది గాయపడ్డారు.అనంతరం ఆందోళనకారులు రెండు చెక్‌పోస్టులపై ప్రతీకార దాడుల్లో 13 మంది సైనికులు మృతిచెందారు. రమాదీ, సలేహెదీన్‌ల్లో జరిగిన ఇలాంటి మరో రెండు దాడుల్లో 9 మంది సైనికులు చనిపోయారు. నిరసనకారులు మరొక సైనికుడిని కిడ్నాప్‌ చేశారు.